-
Saturday, April 24, 2010
నాదారి ఎడారి
చిత్రం: శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
కృష్ణ, జయప్రద, జగ్గయ్య, పద్మనాభం
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
దర్శకత్వం: బాపు-రవణ
నాపేరు బికారి నాదారి ఎడారి
మనసైనచోట మజిలీ
కాదన్నచాలు బదిలీ
నాదారి ఎడారి నాపేరు బికారి ॥2॥
తోటకు తోబుట్టువును
ఏటికి నేబిడ్డను
పాటనాకు సైదోడు
పక్షినాకు తోడు
విసుగురాదు ఖుషీపోదు
వేసటలేనేలేదు ॥2॥
అసలునామరోపేరు
ఆనందవిహారి ॥నాదారి॥
మేలుకొని కలలుగని మేఘాలమేడపై
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకుని
ఇంద్రధనసు పల్లకి ఎక్కికలుసుకోవాలని ॥2॥
ఆకాశవీథిలో పయనించు బాటసారి ॥నాదారి॥
కూటికినేపేదను గుణములలో పెద్దను
సంకల్పం నాకు ధనం సాహసమే నాకుబలం
ఏనాటికొ ఈగరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారి ॥నాదారి॥
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment