దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈపేరు వినంగానే నాకు గుర్తొచ్చేపాట "కృష్ణశాస్తి కవితలా కృష్ణవేణి పొంగులా.." నాకు నచ్చిన పాత సినిమాపాటల్లో కొన్ని ఆయన రాసినవి అని చాలా ఏళ్ళు కొన్నైతే ఈమద్యదాకా తెలీదు. చెట్టు పేరు తెలీనంత మాత్రాన చందనం వాసన ఆస్వాదించకుండా ఉండలేం కదా. అలానే ఆయన రాసిన పాటలు కూడా. అందులో నాకు బాగా నచ్చిన లలిత సంగీత పాట ఒకటి.
గుండెల్లో ఉండాలి కులాసా
గుండెల్లో ఉండాలి కులాసా
నిండాలి మనసులోదిలాసా
హైలెస్సా అంటు నావ
అలలమీద వదలాలలి
హోలెస్సా అంటు నావ
గాలిదారి కదలాలి ||2|| ||గుండెల్లో||
గాలికి కోపంరానీ కడలికి వెర్రెత్తనీ ||2||
గాలికడలి ఏకమై బయలంతా రేగనీ
గాలిదాలు పట్టేది కడలి నడకద్రొక్కేది ||2||
కనపడని సరంగొకడే
కనపడని సరంగొకడే ॥గుండెల్లో॥
చీకట్లో వెన్నెల్లు చిలికేదెవరు
నీళ్ళల్లో దారులు నిలిపేదెవరు ||2||
అసలుపడవ నడిపేది
అవలి ఒడ్డు చేర్చేది ||2||
అగపడని సరంగొకడే
అగపడని సరంగొకడే ॥గుండెల్లో॥
-
2 comments:
waiting for some more good songs..!!Good luck.
పాట వింటూవుంటే ప్రశాంతంగా ఉంది. థాంక్స్. ఇక్కడ చూడండి, మరి కొన్ని మీకు తెలియని మధురగీతాలు దొరకొచ్చు. http://surasa.net/music/lalita-gitalu/
Post a Comment