BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS

Thursday, September 23, 2010

ఇలలో సాటిలేని


చిత్రం: సంఘం
తారాగణం:అంజలీదేవి, వైజయంతీమాల, రామారావు, నాగయ్య తదితరులు
సంగీతం: ఆర్.సుదర్శనం
సాహిత్యం: తోలేటి
 నేపద్యగానం: పీ.సుశీల


ఓంకార నాదస్వరూపా
భావరాగ తాళప్రదీపా
నాట్యకలాపా నటరాజా
నమోనమో నటరాజా
నమోనమామి

ఇలలోసాటిలేని భారతదేశం
ఇలలోసాటిలేని భారతదేశం నాదేశం
ఇలలోసాటిలేని భారతదేశం
కనులకు సుందరం
కళలకు మందిరం
మాదేశం సుందరం
కళలకు మందిరం

పావన హిమశైలం
నిర్మలగంగానది జీవప్రవాహం
దక్కనువజ్రాల పచ్చలహారం
మాకాశ్మీరం రమ్యారామం
భగవద్గీత వేదనినాదం
గౌతమబుద్ధుని జ్ఞానప్రదీపం
రామకృష్ణబోధలో అమృతసారం
తేజాన వెదజల్లే దివ్యప్రదేశం

కాళిదాసకావ్యం జయదేవునిగానం
అజంత‌ఎల్లోరా అద్భుతశిల్పం
గాంధిరవీంద్రుల ఘనసందేశం
ఖండఖండముల చాటేదేశం