-
Sunday, April 4, 2010
రాజీవనేత్రాయ
అన్నమాచార్య కీర్తన
గానం: కే.జే.జేసుదాసు
రాజీవనేత్రాయ రాఘవాయనమో
సౌజన్యనిలయాయ జానకీశాయ ||2||
దశరథతనూజాయ తాటకదమనాయ
కుశికసంభవయజ్ఞ గోపనాయ ॥2॥
పశుపతిమహాధనుర్భంజనాయానమో ॥2॥
విశదభార్గవరామ విజయకరణాయ ॥రాజీవ॥
హరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ
ఖరదూషణాది రిపుఖండనాయ ॥2॥
ధరణిసంభవసైన్య దక్షకాయానమో॥2॥
నిరువమమహావారి నికిబంధనాయ ॥రాజీవ॥
హతరావణాయ సమ్యమినాథవరదాయ
అతులితాయోధ్య పురాధిపాయ ॥2॥
హితకర శ్రీవేంకటేశ్వరాయానమో ॥2॥
వితదవావినిపాలి వీరరామాయ ॥రాజీవ॥
Posted by సుబ్రహ్మణ్య ఛైతన్య at 12:30 PM
Labels: అన్నమయ్య, రాముడు, శాస్త్రీయం
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment