-
Tuesday, June 8, 2010
ఏ రాగమో ఇది ఏ తాళమో
చిత్రం: అమరదీపం
కృష్ణంరాజు, జయసుథ, మురళీమోహన్
సంగీతం: మాధవపెద్ది సత్యం
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పీ.సుశీల
దర్శకత్వం: కే.రాఘవేంద్రరావు బీ.ఎ.
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతికలిపినాము
ఆహా..ఊహూ..ఆహా..ఉహూ ॥ఏరాగమో॥
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఎదలో మెదిలే సంగతులన్నీ
పలికెను సంగీతమై.. పలికెను సంగీతమై
కలిసిన కన్నుల మెరిసేకలలే
వెలిసెను గమకములై వెలిసెను గమకములై
హోయలైన నడకలే లయలైనవవవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరిసరి అనగానె మరిమరి కొసరాడు
మురిపాలె మనజంట స్వరమైనది ॥ఏరాగమో॥
విరికన్నె తనకు పరువమెకాదు
పరువూ కలదన్నది పరువు కలదన్నది
భ్రమరము తనకు అనుభవమెకాదు
అనుబంధమున్నది అనుబంధమున్నది
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరిమగవానికి సగమని తలపోయు
మనజంటకే జంటసరి ఉన్నది ॥ఏరాగమో॥
Posted by సుబ్రహ్మణ్య ఛైతన్య at 10:51 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment