తారాగణం: అక్కినేని, సుజాత, రాథిక, ప్రభాకరరెడ్డి తదితరులు
గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డిఆనాటి ఆస్నేహమానందగీతం
ఆజ్ఞాపకాలన్నీ మథురాతిమథురం
ఈనాడు ఆహాయి లేదేలనేస్తం
ఆరోజులు మున్ముందిక రావేమిరా
హహ లేదురా ఆసుఖం
రాదురా ఆగతం ఏమిటో జీవితం
ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా
గోడలు దూకిన రోజులు
మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకుని..
ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్
పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా హహహ
నేనూ మారలేదు నువ్వూ మారలేదు
కాలం మారిపోతే నేరం మనదేమికాదు
ఈనేల ఆనింగి ఆలాగె ఉన్నా
ఈగాలిమోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము ఆరోజులు
భ్రమలాగ ఉంటాయి ఆలీలలు
ఆమనసులు ఆమమతలు ఏమాయెరా
ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా
కాలేజిలోక్లాసురూములో
ఓ పాపమీద నువ్వు పేపరుబాల్ కొడితే
ఆపాప ఎడమకాలి చెప్పుతో..
ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ స్క్రౌండ్రర్
ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా పిల్లల పిల్లలకు
పిట్టకథగా చెప్పుకుంటారు అంతే
హహహహ.. ॥ఆనాటి॥
మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిచ్చైమండినాను
ఆగుండె మంటింక ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి బ్రతుకింకలేదు
తనశాపమే నాకు తగిలిందిరా రేయ్
పసిపాపలేలేని ఇల్లాయెరా
ఈకన్నుల కన్నీటికి తుదియేదిరా
ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా
ఈకన్నీళ్ళకు తుదియెక్కడరా
కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా
హహ హహాహ.. ॥ఆనాటి॥
హహ రియల్లీ దోజ్ డేస్ ఆర్ మార్వలస్
కరెక్ట్ రా హహహాహహ
లాలాలలాలా లాలాలలాలా
0 comments:
Post a Comment