BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS

Sunday, November 14, 2010

ఓనిండుచందమామా!


చిత్రం: బంగారు తిమ్మరాజు
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి
దర్శకత్వం: జి. విశ్వనాథ్
రచన: ఆరుద్ర
సంగీతం: ఎస్.పీ. కోదండపాణి
గానం: కే.జే. యేసుదాస్



ఓనిండుచందమామ! నిగనిగలభామ!
ఒంటరిగా సాగలేవు కలసిమెలసిపోదామా
ఓ ఓ ఓ ...
నిదురరాని నిదురరాని తీయనిరేయి
నినుపిలిచెను వలపులహాయి
మధురమైన కలహాలన్నీ
మనసుపడే ముచ్చటలాయె
మేలుకున్న స్వప్నంలోన
ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడనుకానా
లాలించగ సరసకురానా  ॥ఓ నిండుచందమామ॥

దోరవయసు ఊహలునీలో
దోబూచులు ఆడసాగె
కోరుకున్న మురిపాలన్నీ
కొసరికొసరి చెలరేగె
నీదుమనసు నీలోలేదు
నాలోనె లీనమయె
నేటినుంచి తనువులురెండు
నెరజాణ ఒకటాయె  ॥ఓ నిండుచందమామ ॥

Sunday, November 7, 2010

ఎందరో మహానుభావులు



కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: శ్రీ 
తాళం: ఆది

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 

చందురువర్ణుని అందచందమును హృదయారవిందమున 
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగానలోల మనసిజలావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి
బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు 

సరగున పాదములకు స్వాంతమను సరోజమును
సమర్పణము సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను పాడుచును 
సల్లాపముతో స్వరలయాది రాగములను దెలియు 
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున 
శోభిల్లు భక్తకోటులిలలో తెలివితో చెలిమితో 
కరుణగల్గి జగమెల్లను సుధా దృష్టిచే 
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలుమీర నడలుగల్గు సరసుని 
సదా కనుల జూచుచును పులకశరీరులై 
ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము 
గలవారెందరో మహానుభావులు

నీమేనునామ వైభవంబులను 
నీపరాక్రమ ధైర్యముల శాంతమానసము నీవులను 
వచనసత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను 
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి 
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు 
వారెందరో మహానుభావులు
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన 
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు 
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు 
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము 
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్
శివాది సన్మతముల గూఢములన్ 
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి 
భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి 
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన 
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు 
రామభక్తుడైన త్యాగరాజనుతుని 
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు